మద్దూరు మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ లో స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టు ఖాళీ.
ప్రధానోపాధ్యాయులు కోట నరేందర్ రెడ్డి
మద్దూరు అక్టోబర్4, ప్రజా వాణి,
పి ఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్, మద్దూర్లో స్పెషల్ ఎడ్యుకేటర్ (స్పెషల్ ఎడ్యుకేటర్) పోస్టు ఖాళీగా ఉంది.
ప్రత్యేక విద్యా రంగంలో, అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోట నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
అభ్యర్థుల అర్హత:
స్పెషల్ బి ఈ డి (స్పెషల్ ఎడ్యుకేషన్) పూర్తి చేసి ఉండాలి లేదా
జనరల్ బి ఈ డితో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్ లో దిప్లమా పూర్తి చేసి ఉండాలి.
పై అర్హతలు కలిగిన ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలతో 2026 అక్టోబర్ 7వ తేదీలోపు పి ఏం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్, మద్దూర్లో దరఖాస్తు చేసుకోవాలి.
గమనిక: అర్హత కలిగిన అభ్యర్థులు గడువు తేదీలోపు దరఖాస్తు చేసుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనిఆయన కోరారు.

