బతుకమ్మ దసరా సందర్భంగా పంచాయతీ సిబ్బందికి దుస్తుల పంపిణీ
పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయం-సర్పంచ్ కవిత
బెజ్జంకి,అక్టోబర్ 16 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని లక్ష్మీపూర్ గ్రామంలో బతుకమ్మ,దసరా పండుగలను పురస్కరించుకొని గ్రామ పంచాయతీ సిబ్బందికి సర్పంచ్ ముక్కిస్ కవిత–రత్నాకర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు చీరలు, డ్రెస్సులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కవిత మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో గొప్పవని అన్నారు. గ్రామం పరిశుభ్రంగా ఉండి, ప్రజలందరూ ఆరోగ్యంగా జీవించాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగావ్యవహరించాలని సూచించారు. రోడ్లపై చెత్త వేయకుండా,మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని కోరారు. గ్రామ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించినప్పుడే ఆరోగ్యకరమైన వాతావరణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గంగాధర హరీష్, పంచాయతీ కార్యదర్శి కిషన్, వార్డు సభ్యులు పాకాల శ్రీనివాస్ రెడ్డి, ముక్కిస్ రత్నాకర్ రెడ్డి, బోనగిరి మహేష్, ఏఎంసీ వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ తుమ్మ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
