*బడ్జెట్ స్కూల్ మేనే జ్మెంట్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం…*
*పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి.*
*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 02*
బడ్జెట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ బి-స్మాట్ ఆధ్వర్యంలో భువనగిరి పట్టణ బైపాస్ రోడ్డులో గల హోటల్ వివేరాలో శుక్రవారం రోజున ఏర్పాటు చేసిన గురు పూజోత్సవ కార్యక్రమానికి భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ రయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ఉపాధ్యాయుల సేవలను అభి నందించారు
. ఈ కార్య క్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి , జిల్లా గ్రంధాలయ సంస్థల చైర్మన్ అవేస్ చిస్తి , పిఎసిఎస్ చైర్మన్ పక్కిర్ కొండల్ రెడ్డి , మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ పోతంశెట్టి మంజుల , ఇతర ప్రజాప్రతినిధులు , నాయకులు , బి-స్మాట్ ప్రతినిధులు , పాఠశాలల యాజమాన్యాలు , ఉపాధ్యాయులు తది తరులు పాల్గొన్నారు.

