📄 ePaper
Epaper 2
Sunday, October 4, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaప్రజల పక్షాన పని చేసే జర్నలిజం వ్యవస్థ అవసరo — రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్...

ప్రజల పక్షాన పని చేసే జర్నలిజం వ్యవస్థ అవసరo — రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాసరెడ్డి

📰 Generate e-Paper Clip

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

ప్రజల పక్షాన పని చేసే జర్నలిజం వ్యవస్థ అవసరమని రాష్ట్ర మీ డియా అకాడమీ చైర్మన్ కే. శ్రీని వాసరెడ్డి అన్నారు. జర్నలి స్టులు వృత్తి గౌరవాన్ని నిలబెట్టేలా పని చేయాలని పిలుపుని చ్చారు. రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమా వేశ మందిరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సామాజిక మాధ్య మాలపై నిర్వ హించిన ఒకరోజు వర్క్ షాప్ కు ఆయన ముఖ్య అతిథిగా హా జరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ మారుతున్న సాంకేతిక తను అందిపుచ్చుకుని మెరుగైన జర్నలిజాన్ని ప్రజలకు అం దించేందుకు, అలాగే వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంపొందిం చుకునేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజె న్స్, సోషల్ మీడియా జర్నలిస్టులకు ఉపయోగపడుతుందని, దీనిని దృష్టిలో ఉంచు కొని రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వ హిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే నల్గొండ డివిజన్ పరిధిలోని జ ర్నలిస్టులకు ఉద్దేశించి ఒక రోజు వర్క్ షాప్ నిర్వ హిస్తున్నట్లు వెల్ల డించారు. అలాగే అక్టోబర్ 12న నాగార్జున సాగర్ లో కూడా నాగార్జునసాగర్ పరిసర ప్రాంతాల జర్నలిస్టులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సామాజిక మాధ్యమా లపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం జర్నలిజంలో ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్, సోషల్ మీ డియా ప్రభావం చాలా ఎక్కువగా ఉందని, దీన్ని సక్రమంగా విని యోగించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.ఈ సందర్భం గా చైర్మన్ పత్రిక స్వేచ్ఛ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రా నిక్ మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, విస్తృతార్థాలు, వర్కింగ్ జర్నలిస్ట్, వృత్తి పరమైన జర్నలిస్టు లు తెలుసుకోవాల్సిన ప్రధాన చట్టాలు తదిత అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన శిక్షణ సహాయ కలెక్టర్ ఎన్. శ్రీకాం త్ రె డ్డి మాట్లాడుతూ ఆర్టిఫిజిల్ ఇం టెలిజెన్స్ వచ్చిన తర్వాత ప్రతి పౌరుడు జర్నలిస్టులా వ్యవహరి స్తున్నారని, ఇలాంటి పరిస్థితుల లో వార్తల్లో ఏది నిజం, ఏది అబ ద్దమో ప్రజలకు తె లిసేలా వార్త లందించాలని, ఏ ఐ, సోషల్ మీ డియా వాడకాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉం దని, ముఖ్యం గా ఇది జర్నలిస్టు లకు ఎంతో అవసరమని అన్నా రు. స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో మంచి తో పాటు, చె డు కూడా సంభవించే అవకాశం ఉందని, ఆర్టిఫిషియల్ ఇంటెలి జెన్స్ సద్వినియోగం అయ్యేలా జర్నలి స్టులు కృషి చేయాలని, రి పోర్టర్లు నిరాధార వార్తలు రాయ వద్దని కోరారు.ఈ సందర్భంగా ఆర్టిఫిజిల్ ఇంటెలిజెన్స్ పై టై మ్స్ అఫ్ ఇండియా ఎడిటర్ ఇన్వె స్టిగేషన్ ఉడుముల సుధాకర్ రెడ్డి, సోషల్ మీడియా పై నరసిం హస్వామిలు జర్నలిస్టు లకు శిక్ష ణ ఇచ్చారు. నల్గొండ ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, నల్గొండ జిల్లా సమాచార శాఖ స హాయ సంచాలకులు యు. వెం కటేశ్వర్లు, జర్నలిస్టు యూనియన్ అధ్యక్షులు కృష్ణారెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ ఓఎస్ డి రహమాన్, పిఆర్ ఓ శైలేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.