*పేదింటి ఆడబిడ్డల పెళ్లికి కళ్యాణ లక్ష్మి పథకం అండనిస్తుంది…*
*ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య.*
*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 31*
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ఎమ్మెల్యే కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠా త్మకంగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ పథకం ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అంద జేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో పేదింటి ఆడ బిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి , షాది ముబారక్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ పేద కుటుంబం కూడా తమ ఆడబిడ్డల వివాహాలను భారంగా భావించ కూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకం ద్వారా అండగా నిలుస్తోందన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని , అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్ పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

