📄 ePaper
Epaper 2
Thursday, October 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపారిశుద్ధ్య కార్మికులకు ఘనంగా సన్మానం

పారిశుద్ధ్య కార్మికులకు ఘనంగా సన్మానం

📰 Generate e-Paper Clip

పారిశుద్ధ్య కార్మికులకు ఘనంగా సన్మానం

సర్పంచుల సంఘము అధ్యక్షుడు(ఎల్లకొండ) గ్రామ సర్పంచ్ కొండల్ యాదవ్

ప్రజా వాణి,న్యూస్ :నవాబుపేట్ మండలంలోని ఎల్లకొండ గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులందరూ స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా గ్రామ పారాశుద్ధ్య కార్మికులందరినీ ఘనంగా సన్మానించడం జరిగింది.సర్పంచ్ కొండల్ యాదవ్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు సమాజాన్ని పరిసరాలను శుభ్రంగా ఉంచటంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తారని వారు అన్నారు.పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం బాగుండాలంటే గ్రామస్తులందరం తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలి.గ్రామంలో పారిశుద్ధ్య ఇల్లు కార్యాలయంలో మరియు వీధుల నుండి చెత్తను సేకరించి డ్రైనేజీ శుభ్రతలో అడ్డంకులు తొలగించి మురుగునీరు సజావుగా సాగేలా పారిశుధ్య కార్మికులు చేస్తారు అని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాలకవర్గ పాలకవర్గ సిబ్బంది అలాగే గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.