పట్టభద్రులు ఎమ్మెల్సీగా బిజెపికే పట్టం కడతారు..
నెల్లికుదురులో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం
ప్రజావాణి,నెల్లికుదురు: పట్టభద్రులైన ఓటర్లు వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి అభ్యర్థికే పట్టం కడతారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు వల్లబు వెంకటేశ్వర్లు అన్నారు. మండల కేంద్రం నెల్లికుదురులో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాక సమావేశం బిజెపి మండల అధ్యక్షులు చందు రాజకుమార్ అధ్యక్షతన గురువారం నిర్వహించారు.దీనికి వెంకటేశ్వర్లు హాజరై ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం సాధించడానికి అవసరమైన ప్రణాళిక వ్యూహరచన పార్టీ నాయకులకు ముఖ్య కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తూ భారతదేశం అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారని అందుకే యువత బిజెపి వైపు చూస్తోందన్నారు.
*పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి..*
అదే సమయంలో కేంద్రం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని పార్టీ మండల అధ్యక్షులు చందు రాజ్ కుమార్ యాదవ్ సూచించారు.పట్టబద్రులైన ఓటర్లు ఎంతో మేధావులని దేశం కోసం ఆలోచించే వారిని ఇందుకోసం బీజేపీకే ఓటు వేయనున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ సింగారపు సతీష్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పాపారావు, ప్రభాకర్ రెడ్డి,తోట రేణుక,జి సురేష్ నెల్లికుదురు మండల ఎమ్మెల్సీ కన్వీనర్ రాస యాకిరెడ్డి, బాదావత్ సురేష్,జాటోత్ విజేందర్,ఎండి ముస్తఫా,సలుగు ప్రవీణ్,డేగల నవీన్,తోట రమేష్,దుస్స యాకయ్య,గుంశవాళి,లింగన్న, యాకన్న,నరసయ్య,జలక యాకన్న, తోట సురేష్,గుగులోత్ సోమన్న,ఏర్పుల వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

