📄 ePaper
Epaper 2
Saturday, October 24, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణనిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు పండుగ సాయన్న

నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు పండుగ సాయన్న

📰 Generate e-Paper Clip

*నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు పండుగ సాయన్న*

*జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి చంద్రయ్య*

*మన ప్రజావాణి* *మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-*

పెత్తందారులు, భూస్వాములు, జమీందారీ వ్యవస్థతో పాటు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన తెలంగాణ ప్రజా వీరుడు పండుగ సాయన్న ముదిరాజ్ అని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి చంద్రయ్య తెలిపారు. గురువారం జిల్లాలోని నస్పూర్‌లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పండుగ సాయన్న జయంతి వేడుకలకు హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి, పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ పి చంద్రయ్య మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల అణచివేతను ఎదిరించి పోరాడిన ప్రజా వీరుడు పండుగ సాయన్న ముదిరాజ్ అని తెలిపారు. తెలంగాణ ప్రజావీరుడుగా, తెలంగాణ రాబిన్‌ హుడ్‌గా పేరుగాంచిన పండుగ సాయన్న జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. సమాజంలోని పేద ప్రజల కష్టాలను గుర్తించి, వారి సంక్షేమానికి కృషి చేశారని, ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన పండుగ సాయన్న సేవలు చిరస్మరణీయమని తెలిపారు. సమాజంలోని పేద ప్రజల సంక్షేమానికి తోడ్పడిన ఇలాంటి మహనీయులను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. మహనీయులు చూపిన మార్గంలో నడుస్తూ సమాజంలో సమానత్వం, సేవాభావం, పేదల పట్ల మానవత్వం పెంపొందించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మోతిరాం, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి నీరటి రాజేశ్వరి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి చాతరాజుల దుర్గాప్రసాద్, జిల్లా పరిషత్ సిఈఓ గణపతి, జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు గరిగంటి కొమురయ్య, రాష్ట్ర సీనియర్ కార్యదర్శి తండబోయిన శ్రీకాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి సాదబోయిన కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు మేకల తిరుపతి, మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు బూతపల్లి రాజేశం, జిల్లా యువత అధ్యక్షుడు గరిగే సుమన్, రాష్ట్ర యువత కార్యదర్శి కంకణాల సచిన్, మంచిర్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి తోటి రమేష్,ముదిరాజ్ సంఘం ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.