దుర్గమాతను దర్శించుకున్న లద్నూరు గ్రామ సర్పంచ్ దంపతులు
ఘనంగా దీపారాధన
మద్దూరు అక్టోబర్16, ప్రజా వాణి,
మండలంలోని లద్నూరు గ్రామంలో పెద్దమ్మ తల్లి యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన దుర్గమాతను గ్రామ సర్పంచ్ కాసర్ల రేణుక కనకరాజు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దీపారాధన చేసిన అనంతరం మాట్లాడుతూ గ్రామ ప్రజలు శాంతియుతంగా ఉండాలని మొక్కులు చెల్లించుకున్నరు. రానున్న రోజుల్లో గ్రామ ప్రజలు గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం అయి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.
