📄 ePaper
Epaper 2
Saturday, October 31, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణతాగునీటి సరఫరా మెరుగుదలకు చర్యలు.. వాటర్ ట్యాంక్‌కు నూతన మెట్ల నిర్మాణం ప్రారంభం

తాగునీటి సరఫరా మెరుగుదలకు చర్యలు.. వాటర్ ట్యాంక్‌కు నూతన మెట్ల నిర్మాణం ప్రారంభం

📰 Generate e-Paper Clip

**తాగునీటి సరఫరా మెరుగుదలకు చర్యలు.. వాటర్ ట్యాంక్‌కు నూతన మెట్ల నిర్మాణం ప్రారంభం*

హనుమకొండ జిల్లా, వేలేరు: గ్రామ ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించడంతో పాటు వాటర్ ట్యాంక్ నిర్వహణను సులభతరం చేసే లక్ష్యంతో వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఎస్సీ కమ్యూనిటీ భవనం సమీపంలోని వాటర్ ట్యాంక్‌కు గ్రామపంచాయతీ నిధులతో నూతన మెట్ల నిర్మాణం, వాటర్ పైప్‌లైన్ ఏర్పాటు, ఇతర మరమ్మతు పనులను సర్పంచ్ బిల్లా యాదగిరి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. వాటర్ ట్యాంక్‌కు ఉన్న పాత మెట్లు శిథిలావస్థకు చేరడంతో నిర్వహణ సిబ్బంది పైకి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అదేవిధంగా పాత పైప్‌లైన్ సరిగా లేకపోవడంతో నీటి సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు భవిష్యత్తులో తాగునీటి సరఫరాకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా నూతన మెట్ల నిర్మాణం, పైప్‌లైన్ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు.

పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీకర్, వార్డు సభ్యులు చైతన్య, లక్ష్మీనారాయణ, సురేష్, సునీల్, గ్రామ పెద్దలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.