📄 ePaper
Epaper 2
Friday, October 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణతడ్కల్‌లో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం

తడ్కల్‌లో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం

📰 Generate e-Paper Clip

తడ్కల్‌లో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం

స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి

నారాయణఖేడ్, అక్టోబర్ 15 (ప్రజావాణి):

కంగ్టి మండలం తడ్కల్ గ్రామంలో రూ.10 లక్షల ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ప్రారంభించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

గ్రామాభివృద్ధికి సర్పంచ్‌ సుగుణ మల్లారెడ్డి కృషి

తడ్కల్ గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారానికి సర్పంచ్‌ సుగుణ మల్లారెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారు. గ్రామ అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులు చేపట్టేలా కృషి చేస్తూ, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గ్రామ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో వివిధ కార్యక్రమాలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, పేదల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. నియోజకవర్గంలో రహదారులు, తాగునీరు, విద్యుత్‌ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్‌ వినోద్‌ పాటిల్‌, సీడీసీ చైర్మన్‌ షాదుల్‌ సాబ్‌, మండల అధికారులు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.