📄 ePaper
Epaper 2
Wednesday, October 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణటిబిజికేఎస్ కాసీపేట-2 గని పిట్ కార్యదర్శిగా ప్రతాప్ సారంగపాణి

టిబిజికేఎస్ కాసీపేట-2 గని పిట్ కార్యదర్శిగా ప్రతాప్ సారంగపాణి

📰 Generate e-Paper Clip

*టిబిజికేఎస్ కాసీపేట-2 గని పిట్ కార్యదర్శిగా ప్రతాప్ సారంగపాణి*

* *మన ప్రజావాణి* మందమర్రి:-

సింగరేణి ఏరియాలోని కాసిపేట-2 గని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టిబిజికేఎస్) యూనియన్ గని పిట్ కార్యదర్శిగా ప్రతాప్ సారంగపాణి నియమితులయ్యారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆదేశాల మేరకు సోమవారం నూతన కార్యవర్గాన్ని ప్రకటించినట్లు యూనియన్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. కాసీపేట 2 గని నూతన పిట్ కార్యదర్శిగా ప్రతాప్ సారంగపాణి, అసిస్టెంట్ పిట్ కార్యదర్శిగా అసంపల్లి వెంకటేష్, చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా మస్కా రమేష్ లను ఏకగ్రీవంగా నియమించినట్లు పేర్కొన్నారు. నూతనంగా నియమితులైన బాధ్యులు కాసిపేట-2 గని పై యూనియన్ కు ఉత్తమ సేవలు అందించాలని, యూనియన్ అభ్యున్నతికి కృషి చేస్తూ, కార్మికుల మనస్సు గెలుచుకోవాలని ఆకాంక్షించారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉండి, పోరాడాలని సూచించారు. నూతన బాధ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రతాప్ సారంగపాణి మాట్లాడుతూ, తనపై నమ్మకంతో కాసీపేట-2 గని టిబిజేకేఎస్ పిట్ కార్యదర్శిగా నియమించిన యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి కి, ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ కు, ఏరియా నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా, యూనియన్ బలోపేతం కోసం, కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.