జల్లాపల్లి ఆభాదిలో అభివృద్ధి,ఆధ్యాత్మిక వేడుకల సందడి.
శ్రీ జగదాంబ మాత,సేవాలాల్ మహారాజ్ మందిర 4 వ వార్షికోత్సవంలో పాల్గొన్న పోచారం,కాసుల.
రూ.10 లక్షలతో నిర్మించిన ఐకేపీ భవనం ప్రారంభం. మహిళలకు సాధికారతపై సూచనలు
గ్రామాభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేస్తాం.
మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగాలని పోచారం,కాసుల పిలుపు.


కోటగిరి/ప్రజావాణి:-నియోజకవర్గ ప్రజలందరూ తన కుటుంబ సభ్యులేనని బాన్సువాడ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధి కి ఐకేపీ భవనం వేదిక కావాలని తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రియల్ చైర్మన్ కాసుల బాలరాజు స్పష్టం చేశారు. గురువారం నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం పోతంగల్ మండలం జల్లాపల్లి ఆభాది గ్రామంలో శ్రీ జగదాం బ మాత సేవాలాల్ మహారాజ్ మందిర 4వ వార్షికోత్సవం అలాగే రూ.10లక్షల వ్యయంతో నిర్మించిన ఐకేపీ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి,కాసుల బాలరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యా రు.ఈ సందర్భంగా వారు స్థానిక,మండల నాయకులు,ప్రజా ప్రతినిధులు,మహిళలు,అధికారులతో కలిసి ఐకేపీ నూతన భవనాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా నూతన భవనంలో డ్వాక్రా మహిళలతో పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాసుల బాలరాజు ముచ్చటించారు.మహిళా సాధికారత, స్వయం ఉపాధి అవకాశాలు,స్వల్పకాలిక పరిశ్రమల స్థాపన పై వారు వివరించారు.మహిళా సంఘాలకు సమకూరిన నిధులను లాభదాయకమైన కార్యకలాపాలకు వినియోగిం చుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని వారు సూచించారు. అనంతరం శ్రీ జగదాంబ మాత సేవాలాల్ మహారాజ్ మంది ర 4వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో పోచారం, కాసుల ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ ప్రాంగణం లో ఏర్పాటు చేసిన సభలో గ్రామ పెద్దలు,సర్పంచ్ ఆధ్వర్యం లో పోచారం శ్రీనివాస్ రెడ్డి,కాసుల బాలరాజులను గజమాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గ్రామానికి, ఈ ప్రాంత రైతులకు చేసిన సేవలను కొనియాడారు.ఈ సభలో పోచారం శ్రీనివాస్ రెడ్డి,కాసుల బాలరాజు మాట్లాడుతూ.నిజాం షుగర్ ఫ్యాక్టరీ భూములను ఈ ప్రాంత రైతులకు ఏ విధంగా అందజేయడం జరిగిందో వివరించారు.గత 13 ఏళ్లలో గ్రామానికి కోట్లాది రూపాయల నిధులు కేటాయించామని తెలిపారు.గ్రామంలో డ్రైనేజీ నిర్మాణానికి రూ.35 లక్షలు మంజూరుచేస్తామని.ఖబరస్థాన్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి నిధులు విడుదల చేస్తామని చెప్పారు.ఫంక్షన్ హాల్ ఏర్పాటుకు రూ.25 లక్షలు కేటాయిస్తామని,ముదిరా జ్ కులస్తుల పెద్దమ్మతల్లి ఆలయ నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.నియోజక వర్గ ప్రజలందరూ తన కుటుంబ సభ్యులేనని,నియోజక వర్గంలో ఇల్లు లేని వారు ఉండకూడదన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు.బాన్సువాడ నియోజకవర్గంలో 11 వేల ఇళ్లను నిర్మించినట్లు తెలిపారు.సేవాలాల్ మహారాజ్ ఆశీర్వాదంతో 22 వేల కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేయించుకోవాలని ఆకాంక్షించారు.ప్రతి రైతు పొలంలోని ప్రతి గుంటకు నీరు అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.వైద్య రంగంలో కోటగిరిలో 50 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.బాన్సువాడ నియోజక వర్గాన్ని విద్యా కేంద్రంగా తీర్చిదిద్దామని తెలిపారు.రూ.200 కోట్ల వ్యయంతో పీఎస్ఆర్ నగర్ లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం జరుగుతోందని.ఇందులో ఐదో తరగతి నుంచి అన్ని వర్గాల విద్యార్థులకు ఉచిత విద్య అందించనున్నట్లు వెల్లడించారు.రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మరిన్ని అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు చేపట్ట నున్నట్లు తెలిపారు.ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం,200 యూనిట్ల ఉచిత విద్యుత్,సబ్సిడీ గ్యాస్,సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు.రాష్ట్రంలో 3 కోట్ల 45 లక్షల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బర్మవత్ వివేక్,ఉప సర్పంచ్ మొహమ్మద్ ఖాజా గౌసిద్దీన్,పోతంగల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు పుప్పాల శంకర్,జల్లాపల్లి ఆభాది కాంగ్రెస్ అధ్యక్షుడు ధనరాజ్, ఉపాధ్యక్షుడు ఎం.డీ.మతీన్, పోతంగల్ మండల సర్పంచుల ఫోరం కన్వీనర్ సింధె షాజీ పాటిల్,కోటగిరి మండల సర్పంచుల ఫోరం కన్వీనర్ బర్ల మధుకర్,ఏఎంసీ చైర్మన్ గైక్వాడ్ హనుమంతు,జల్లాపల్లి తాండ సర్పంచ్ ధారావత్ రాజు,జల్లాపల్లి ఫారం సర్పంచ్ షేక్ దస్తగిరి, జల్లాపల్లి ఓల్డ్ విలేజ్ సర్పంచ్ సుంకు లతారవి, మాజీ ఎంపీపీ గంధపు పవన్,మాజీ జిల్లా కోఆప్షన్ సభ్యులు సిరాజ్,మాజీ మండల అధ్యక్షుడు ఏజాజ్,మాజీ మండల కోఆప్షన్ సభ్యుడు ఇస్మాయిల్,తాండ నాయక్ దేవిసింగ్, కారోభార్ భోజిరాం,ఎంపీడీ వో చందర్ నాయక్,పీఆర్ఏఈ సాయిలు,హౌసింగ్ ఏఈ ఆర్.ఆదర్శ్ గౌడ్,ఏపీఎం భాస్కర్, విద్యుత్ ఏఈ రాజేష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి డి. వినోద్,జీపీఓ సాయిలు నాయకులు సాదిక్,వోలివుద్దీన్, శేషారావు,దేవిసింగ్,హనుమంతరావు పటేల్,సోషల్ మీడియా కన్వీనర్ మొహమ్మద్ ఖాన్,షేక్ జలీల్,ఆదిల్, హైమద్,ఇస్మాయిల్,వహీద్,గ్రామ పెద్దలు,గ్రామస్తులు పాల్గొన్నారు.

