📄 ePaper
Epaper 2
Sunday, October 25, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజయపురం లో పట్టభద్రుల ఓటు నమోదుపై అవగాహన కార్యక్రమం

జయపురం లో పట్టభద్రుల ఓటు నమోదుపై అవగాహన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

జయపురం లో పట్టభద్రుల ఓటు నమోదుపై అవగాహన కార్యక్రమం

ప్రజా వాణి రిపోర్టర్ నర్సింహులపేట: రానున్న వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులందరూ తమ ఓటును నమోదు చేసుకోవాలనే లక్ష్యంతో జాయిపురం గ్రామంలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు చుక్క వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ పట్టభద్రుల ఓటు ప్రజాస్వామ్యంలో కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. గ్రామంలోని పట్టభద్రులను గుర్తించి, ఓటు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ, అవసరమైన ధ్రువపత్రాలు సిద్ధం చేసుకునేలా సహకరించాలని నాయకులు పిలుపునిచ్చారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రతి అర్హుడైన పట్టభద్రుడి ఓటు నమోదు అయ్యేలా కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ
ఉపాధ్యక్షులు బాలిని ఐలయ్య, మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చిర్ర సతీష్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి వెంకన్న
Jayapuram village Congress party president
Chukka Venkanna ,
SCCL president Mandula Venkanna
వెంకట్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు తోట సురేష్, గ్రామ సర్పంచ్ రేణుక, అశోక్ రెడ్డి, ఉప్పలయ్య, వెంకన్న మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.