📄 ePaper
Epaper 2
Friday, October 2, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్*చిన్నశివనూర్ పల్లె అందాల్లో 'మా ఊరి మల్లన్న'.. ఉత్సాహంగా సాగిన సినిమా షూటింగ్*

*చిన్నశివనూర్ పల్లె అందాల్లో ‘మా ఊరి మల్లన్న’.. ఉత్సాహంగా సాగిన సినిమా షూటింగ్*

📰 Generate e-Paper Clip

*చిన్నశివనూర్ పల్లె అందాల్లో ‘మా ఊరి మల్లన్న’.. ఉత్సాహంగా సాగిన సినిమా షూటింగ్*

*• గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న వైవిధ్యమైన కుటుంబ కథా చిత్రం*

*• చిన్నశివనూర్ గ్రామ ప్రజల ఆదరణ అద్భుతం: చిత్ర యూనిట్ హర్షం*

*• సుబ్బ రెడ్డి ముత్యం దర్శకత్వంలో, సీఆర్ఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాణం*

చేగుంట, (ప్రజావాణి):-
చిన్నశివనూర్ గ్రామం సినీ కళాకారుల సందడితో పులకించిపోయింది. చంద్ర రెడ్డి సుబ్బగారి సమర్పణలో, సిఆర్ఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రసిద్ధ దర్శకుడు సుబ్బ రెడ్డి ముత్యం దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న నూతన తెలుగు చలన చిత్రం ‘మా ఊరి మల్లన్న’ ముఖ్యమైన షెడ్యూల్ చిత్రీకరణ చిన్నశివనూర్ గ్రామంలో అత్యంత విజయవంతంగా పూర్తయింది.
*ఆకట్టుకున్న పల్లెటూరి వాతావరణం:*
పూర్తిగా గ్రామీణ సంస్కృతి, పల్లెటూరి ఆచారాలు మరియు భావోద్వేగాల కలయికతో ఒక అద్భుతమైన కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చిన్నశివనూర్ గ్రామ పల్లెటూరి సహజసిద్ధమైన అందాలు, ఇక్కడి ఇళ్లు, పరిసరాలు సినిమా కథాంశానికి చక్కగా సరిపోయాయని చిత్ర బృందం పేర్కొంది.
*గ్రామస్తుల సహకారం మరువలేనిది:*
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సుబ్బ రెడ్డి ముత్యం మాట్లాడుతూ చిన్నశివనూర్ గ్రామ ప్రజలు చూపించిన ఆదరాభిమానాలు, షూటింగ్ సజావుగా సాగడానికి అందించిన సహకారం మరువలేనిది. పల్లెటూరి వాతావరణంలో తీసిన సన్నివేశాల ఔట్‌పుట్ చాలా అద్భుతంగా వచ్చింది అని సంతోషం వ్యక్తం చేశారు. షూటింగ్ ముగిసిన అనంతరం చిత్ర యూనిట్ సభ్యులు స్థానిక గ్రామస్తులతో కలిసి ఎంతో ఉత్సాహంగా గ్రూప్ ఫోటోలు దిగారు.
*ప్రతిభావంతమైన సాంకేతిక బృందం:*
తెలంగాణ జానపద, గ్రామీణ వైభవాన్ని కళ్లకు కట్టేలా రూపొందుతున్న ఈ చిత్రానికి మహాకాల కథ, స్క్రీన్‌ప్లే,డైలాగ్స్ అందించారు. త్యాగు ఎం. బాలకృష్ణన్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ప్రముఖ సంగీత దర్శకులు కార్తీక్ బి. కొడకండ్ల ఈ చిత్రానికి అద్భుతమైన స్వరాలను సమకూరుస్తున్నారు. చిత్రానికి మైఖేల్ డి’సిల్వా ఎడిటర్‌గా, ఈశ్వర్ పెంతి కొరియోగ్రాఫర్‌గా, కృష్ణవేణి మల్లవజ్జల లిరిసిస్ట్‌గా మరియు దిలీప్ ఫైట్ మాస్టర్‌గా తమ ప్రతిభను అందిస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంలో మనసుకు హత్తుకునేలా వస్తున్న ఈ ‘మా ఊరి మల్లన్న’ చిత్రం ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.