*చండూర్ మున్సిపాలిటీలో నూతనంగా సి – మార్ట్ ఘనంగా ప్రారంభం*
*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*
చండూర్ మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన సి – మార్ట్ సూపర్ మార్కెట్ ప్రారంభోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చండూర్ మాజీ ఎమ్ పి పి తోకల వెంకన్న వారి తో పాటు పడమటితళ్ల సర్పంచ్ గాలెంక రాంబాబు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు శిరంశెట్టి శ్రీధర్ బాబు, గండూరి జనార్దన్ తదితరులు పాల్గొని రిబ్బన్ కట్ చేసి సి-మార్ట్ ను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్ పి పి తోకల వెంకన్న మాట్లాడుతూ, చండూర్ ప్రజలకు నాణ్యమైన నిత్యావసర సరుకులు ఒకే చోట అందుబాటులోకి రావడం సంతోషకరమని, స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని అన్నారు. సి – మార్ట్ యాజమాన్యం మాట్లాడుతూ, తక్కువ ధరలకే నాణ్యమైన ఉత్పత్తులు, రోజువారీ అవసరాలు, గృహ సామగ్రి అన్నీ అందుబాటులో ఉంటాయని, ప్రారంభోత్సవ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు, వందలాది మంది ప్రజలు పాల్గొన్నారు.
