📄 ePaper
Epaper 2
Friday, October 2, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaచండూర్ మున్సిపాలిటీలో అంగడిపేట లోని 5 వ వార్డ్ అసంపూర్తి సిసి రోడ్డు - కోట...

చండూర్ మున్సిపాలిటీలో అంగడిపేట లోని 5 వ వార్డ్ అసంపూర్తి సిసి రోడ్డు – కోట మైసమ్మ కాలనీ వాసుల అవస్థలు

📰 Generate e-Paper Clip

చండూర్ మున్సిపాలిటీలో అంగడిపేట లోని 5 వ వార్డ్ అసంపూర్తి సిసి రోడ్డు – కోట మైసమ్మ కాలనీ వాసుల అవస్థలు

సిసి రోడ్డు పనులు అర్ధాంతరం – దుమ్ము, కంకరతో నరకం చూస్తున్న ప్రజలు

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

చండూర్ మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట 5 వ వార్డ్ కోట మైసమ్మ కాలనీలో సిసి రోడ్డు పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీలో సిసి రోడ్డు నిర్మాణం కోసం గత ఐదు సంవత్సరాల క్రితం పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్, రోడ్డుపై డస్ట్, కంకర పరిచి అలాగే వదిలివేశాడు. దీంతో రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. ద్విచక్ర వాహనదారులు జారిపడి గాయాలపాలవుతున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు, మహిళలు నడవలేని పరిస్థితి. డస్ట్ వల్ల ఇళ్లల్లోకి దుమ్ము చేరి అనారోగ్య సమస్యలు. వర్షం వస్తే బురదమయంగా మారి రాకపోకలకు పూర్తిగా అంతరాయం. పనులు ప్రారంభించి ఐదు సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకునే నాధుడు లేడని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఆరోపిస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి పెండింగ్ లో ఉన్న సిసి రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయించి ప్రజల ఇబ్బందులు తొలగించాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.