📄 ePaper
Epaper 2
Monday, October 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగీతాంజలి స్కూల్ లో బతుకమ్మ సంబరాలు

గీతాంజలి స్కూల్ లో బతుకమ్మ సంబరాలు

📰 Generate e-Paper Clip

గీతాంజలి స్కూల్ లో బతుకమ్మ సంబరాలు
ముదిగొండ అక్టోబర్ 10 ప్రజావాణి
ముదిగొండ మండల పరిధిలోని గోకినపల్లి గ్రామం లో ఉన్న గీతాంజలి స్కూల్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. పాఠశాల హెచ్ ఎం యలిశెట్టి నాసరయ్య సార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి కోలాటం పాటలు ద్వారా ఆటపాటలతో ఉల్లాసంగా బతుకమ్మ దేవత ముందు డ్యాన్స్ చేసారు.ఈ సందర్భంగా గీతాంజలి స్కూల్ హెచ్ ఎం యలిశెట్టి నాసరయ్య మాట్లాడుతూ.. తెలంగాణ ఆడపడుచుల ఆత్మ గౌరవ ప్రతీకలు, మన సంస్కృతి సాంప్రదాయాలు వైభవానికి నిలువెత్తు నిదర్శనం… ప్రకృతిని ఆస్వాదిస్తూ పూజించే అపురూప పండుగ బతుకమ్మ అని పూల పరిమళాలతో ప్రతి ఇల్లు ఆనందంగా ఉండాలని ప్రతి కుటుంబం సుఖ, సంతోషాలతో ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.