📄 ePaper
Epaper 2
Friday, October 2, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణPeddapalliగాంధీ జయంతి సందర్భంగా ఘనంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం

గాంధీ జయంతి సందర్భంగా ఘనంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

పరిశుభ్రతే సామాజిక బాధ్యత

 

ఎన్టీపీసీ అక్టోబర్ 2 ప్రజావాణి:

మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్టీపీసీ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు చిలుముల సాగర్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసిపేట శివాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అనంతరం మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులను శాలువాలతో సన్మానించి, సమాజ పరిశుభ్రత కోసం వారు అందిస్తున్న సేవలను అభినందించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి పండ్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కాసిపేట శివాజీ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీజీ చూపిన పరిశుభ్రత, స్వచ్ఛత మార్గాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు. పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని, స్వచ్ఛమైన సమాజ నిర్మాణానికి తమవంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఈదునూరి మల్లేష్, ఈదునూరి కొమురయ్య, ఈదునూరి శంకర్, చిలుముల సంతోష్, ఏదునూరి అన్వేష్, కొంకటి ప్రశాంత్, ఈదునూరి మంజునాథ్, ఉప్పులేటి శ్రీనివాస్, ఎన్.రెడ్డి ప్రణీత్, జిమ్మిడి రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎన్టీపీసీ మండల సోషల్ మీడియా కన్వీనర్, లేబర్ సెల్ ప్రతినిధులు మరియు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.