కూసుమంచి మండలంలో పశువైద్య సేవలు అంతంతమాత్రమే

కూసుమంచి మండలంలో పశువైద్య సేవలు అంతంతమాత్రమే! పశువులకు సకాలంలో వైద్యం అందక పశుపోషకుల ఇబ్బందులు కూసుమంచి, ప్రజావాణి: కూసుమంచి మండల పరిధిలోని గ్రామాల్లో పశువైద్య సేవలపై పశుపోషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలను పెంచుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. అయితే పశువులు అనారోగ్యానికి గురైనప్పుడు సకాలంలో వైద్యం అందకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని పశుపోషకులు వాపోతున్నారు. గ్రామాల్లో పశువులకు వైద్యం అందించాల్సిన పశువైద్యులు, పశువైద్య సహాయకులు అందుబాటులో ఉండటం లేదనే ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో...