📄 ePaper
Epaper 2
Saturday, October 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకర్ణాటక,ఏపీ,మహారాష్ట్ర వర్తకుల రాకతో కోటగిరిలో జోరుగా ధాన్యం కొనుగోళ్లు

కర్ణాటక,ఏపీ,మహారాష్ట్ర వర్తకుల రాకతో కోటగిరిలో జోరుగా ధాన్యం కొనుగోళ్లు

📰 Generate e-Paper Clip

కర్ణాటక,ఏపీ,మహారాష్ట్ర వర్తకుల రాకతో కోటగిరిలో జోరుగా ధాన్యం కొనుగోళ్లు

సన్న వడ్లకు రికార్డు ధర క్వింటాల్‌కు రూ.3,800 చెల్లింపు.

కొత్తపల్లి సొసైటీ రైతులకు అండగా నిలిచిన ఇతర రాష్ట్ర వర్తకులకు ధన్యవాదాలు తెలిపిన చైర్మన్.

కొనుగోలుదారుల ఆస్తులే షూరిటీగా రైతులకు రక్షణగా అధికారులు చర్యలు తీసుకోవాలి.

ప్రభుత్వం మద్దతు ధర రూ.6,000కు పెంచాలి చైర్మన్ సునీల్ కుమార్ డిమాండ్.

కోటగిరి/ప్రజావాణి:-ఉమ్మడి కోటగిరి మండలంలో ఖరీఫ్ వరి ధాన్యం ప్రైవేట్ కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం తీవ్రస్థాయిలో ఉన్నప్పటికీ నిజాంసాగర్ ప్రాజెక్టు పరిధిలో అత్యధికంగా వరి సాగు చేయబడింది.తెలంగాణలోని ఇతర జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల వ్యాపార వర్తకులు బాన్సువాడ నియోజక వర్గం నుంచి రికార్డు ధర చెల్లించి వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.ప్రత్యేకించి కొత్తపల్లి సొసైటీ పరిధిలోని పలు గ్రామాల్లో ప్రైవేట్ ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి.
ఈ సందర్భంగా కొత్తపల్లి సొసైటీ చైర్మన్ డాక్టర్ సునీల్ కుమార్ చౌదరి మాట్లాడుతూ.రాంపూర్ గ్రామానికి చెందిన శంకర్ ఈ ప్రాంత రైతులకు భరోసానిస్తూ ప్రైవేట్ వరి ధాన్యం కొనుగోళ్లు జరుపుతున్నారన్నారు.స్థానిక రైతులకు షూరిటీగా ఉంటూ ప్రభుత్వ ధర కంటే అధికంగా 12472 సన్నరకం వడ్లకు క్వింటాల్‌కు రూ.3,800 ధర చెల్లించి అండ గా నిలవడం గర్వకారణమని కొనియాడారు.రానున్న రోజు లలో సన్నరకం వడ్లు రూ.6,000 వరకు పలుకవచ్చని వస్తున్న పత్రిక కథనాలు నేడు నిజమవుతున్నాయని తెలి పారు.రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కూడా మద్దతు ధరను పెంచాలని లేనిపక్షంలో ప్రైవేట్ వ్యాపారుల వద్ద హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉన్నందున మద్దతు ధరను రూ.5,000 నుంచి రూ.6,000 వరకు పెంచాలని ఆయన కోరారు.ప్రైవేట్ కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ అధికారులు కొనుగోలుదారుల ఆస్తులను షూరిటీగా ఉంచి విక్రయాలు జరిగేలా చూస్తే రైతులు మోసపోకుండా ఉంటారని ఆయన ఆకాంక్షించారు.రికార్డు స్థాయిలో ధాన్యం విక్రయిస్తున్న ఈ తరుణంలో ప్రభుత్వ యంత్రాంగం వ్యాపారస్తులపై నిఘా ఉంచి.రైతులకు ఎలాంటి మోసాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని కోరారు.మా ప్రాంత రైతుల ధాన్యాన్ని రికార్డు స్థాయిలో కొనుగోలు చేస్తున్న కర్ణాటక,ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వ్యాపారస్తులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఆయన వెంట దేవుని గుట్ట తాండ సర్పంచ్ కోర్ర రవి, రైతులు పుండలీక్,సురేష్,రామ్ కిషన్,ఫకీరా,చిన్న బాబు,రమేష్,ఆంధ్ర,కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వ్యాపార స్తులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.