ఎఎంఆర్ ఫ్యాషన్ క్లబ్ ప్రారంభించిన ఎస్సై
ప్రజావాణి,ఇనుగుర్తి: మండల కేంద్రం ఇనుగుర్తిలో నాగెల్లి అమర్ ఏర్పాటుచేసిన నూతన ఎఎం ఆర్ ఫ్యాషన్ క్లబ్ ను ఎస్ ఐ ప. నరేష్ చేతుల మీదుగా బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ సమాజంలోని ప్రతి వ్యక్తి దుస్తులను ధరిస్తారని స్వయం శక్తితో ఎదిగేందుకు డ్రెస్సులకు చెందిన ఫ్యాషన్ క్లబ్ ను పెంచుకోవడం పట్ల అమర్ ను అభినందించారు.
ఫ్యాషన్ క్లబ్ ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఐ సూచించారు. ప్రొప్రైటర్ అమర్ మాట్లాడుతూ వినియోగదారుల అవసరం మేరకు నాణ్యమైన డ్రెస్సులను సరసమైన ధరలకు అందించాలనే లక్ష్యంతో మండల కేంద్రం ఇనుగుర్తిలో ఫ్యాషన్ క్లబ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కార్యక్రమంలో దార్ల రామ్మూర్తిగండు నాగన్న గౌడ్,థామస్ రెడ్డి, దాసరి ప్రకాష్, పప్పుల వెంకన్న(108),పప్పుల వెంకన్న(టీచర్), నాగెల్లి వెంకటేష్,దార్ల భాస్కర్, మోటమారి వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

