ఉద్యోగం సాధించిన యువకుడి సేవాభావం
కూసుమంచి, అక్టోబర్ 2 (ప్రజావాణి):
కూసుమంచి గ్రామానికి చెందిన దార అఖిల్, దార ఉపేందర్, విజయనిర్మల దంపతుల ప్రథమ కుమారుడు, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL), రక్షణ మంత్రిత్వ శాఖలో మేనేజ్‌మెంట్ ట్రైనీగా ఉద్యోగం సాధించారు. ఉద్యోగం పొందిన సందర్భంగా తన తొలి నెల జీతం నుంచి రూ.30 వేల మొత్తాన్ని ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు విరాళంగా అందజేశారు.
ఈ మేరకు రూ.30 వేల చెక్కును ఆలయ పూజారి, ఈఓతో పాటు గ్రామ పెద్దల సమక్షంలో అందజేశారు. యువకుడు ఉద్యోగం సాధించిన ఆనందాన్ని సమాజ సేవతో పంచుకోవడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. యువత ఉద్యోగాల్లో స్థిరపడటంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం అభినందనీయమని గ్రామ పెద్దలు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు చెన్న మోహన్, మాదాసు ఉపేందర్, భారీ భద్రం, అంతోటి వెంకన్న, జూనియర్ అసిస్టెంట్ రామదాసు తదితరులు పాల్గొన్నారు. అఖిల్‌ను గ్రామస్థులు అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

