ఆర్టీసీ బస్సులు ఆపడం లేదంటూ నడి రోడ్డు మీద గ్రామస్థుల రాస్తారోకో
* గ్రామ సర్పంచ్ ప్రవీణ్
* ఉప సర్పంచ్ అశోక్ వార్డు సభ్యులు మహిళలు యువకులు గ్రామస్థులు వందలాది మంది
జమ్మికుంట అక్టోబర్ 2 (ప్రజావాణి)
హుజురాబాద్ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం శాలపల్లి ఇందిరానగర్ గ్రామంలో ఆర్టీసీ బస్సులు నిలపడం లేదని ఆరోపిస్తూ గ్రామ ప్రజలు ఆందోళనకు దిగ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట హుజురాబాద్ జమ్మికుంట ప్రధాన రహదారిపై గ్రామ ప్రజలు, గ్రామపంచాయతీ పాలకవర్గం బైఠాయించి నిరసన తెలిపారుహుజురాబాద్–జమ్మికుంట ప్రధాన రహదారిపై నిత్యం వందలాది ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ, శాలపల్లి ఇందిరానగర్ గ్రామంలో బస్సులు నిలపడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గ్రామ ప్రజలు ప్రయాణాల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనితెలిపారుప్రత్యేకంగా నిత్యం ఉద్యోగాలు కూలి పనులకు వెళ్లే కార్మికులు విద్యార్థులు మహిళలు బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్థులు పేర్కొన్నారు. గ్రామంలో బస్సులు నిలిపేలా చర్యలు తీసుకోవాలని పలుమార్లు హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారుదీంతో సమస్య పరిష్కారం కోసం గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారుఈ సందర్భంగా వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ ఆర్టీసీ అధికారులు స్పందించి గ్రామంలో బస్సులు నిలిపేలా చర్యలు తీసుకోవాలనిడిమాండ్.
చేశారుఈ ఆందోళన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రవీణ్, ఉప సర్పంచ్ అశోక్ వార్డు సభ్యులు మహిళలు, యువకులు గ్రామస్థులు వందలాది మంది పాల్గొన్నారు గ్రామ ప్రజల రవాణా సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలని ప్రధాన రహదారిపై గ్రామానికి బస్సు స్టాప్ సౌకర్యం కల్పించాలని వారుకోరారుఆర్టీసీ అధికారులు స్పందించి గ్రామంలో బస్సుల నిలుపుదలపై స్పష్టమైన నిర్ణయం తీసుకుని విద్యార్థులు ఉద్యోగులు మహిళలు కార్మికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు

