📄 ePaper
Epaper 2
Wednesday, October 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఆర్‌అండ్‌బీ రోడ్డుపై నిరంతరం నీరు..

ఆర్‌అండ్‌బీ రోడ్డుపై నిరంతరం నీరు..

📰 Generate e-Paper Clip

ఆర్‌అండ్‌బీ రోడ్డుపై నిరంతరం నీరు.. దెబ్బతింటున్న రహదారి!
పట్టించుకోని అధికారులు.. ప్రమాదాల ముప్పులో వాహనదారులు
కూసుమంచి, అక్టోబర్ 21( మన ప్రజావాణి):
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గైగోళ్లపల్లి నుంచి నరసింహులగూడెం వెళ్లే ప్రధాన రహదారిపై ఉడతలగూడెం శివారులో నిరంతరం నీరు ప్రవహిస్తుండటంతో ఆర్‌అండ్‌బీ రహదారి దెబ్బతింటోంది. వ్యవసాయ పొలాలకు నీటిని తరలించే పైపుల నుంచి నీరు రోడ్డుపైకి రావడంతో రహదారి తడిసి గుంతలు ఏర్పడుతున్నాయి. దీంతో రోడ్డు క్రమంగా ధ్వంసమవుతోంది.
ఈ మార్గంలో నిత్యం ప్రయాణించే రైతులు, ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై నీరు నిలిచి ఉండటంతో ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డుపై నీరు పారుతున్నా అధికారులకు కనిపించడం లేదా? అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. రహదారి మరింత దెబ్బతినకముందే సంబంధిత ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కోరుతున్నారు.
రోడ్డుపైకి నీరు రాకుండా శాశ్వత చర్యలు చేపట్టడంతో పాటు, ఇప్పటికే దెబ్బతిన్న ప్రాంతానికి మరమ్మతులు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.