ఆర్‌అండ్‌బీ రోడ్డుపై నిరంతరం నీరు..

ఆర్‌అండ్‌బీ రోడ్డుపై నిరంతరం నీరు.. దెబ్బతింటున్న రహదారి! పట్టించుకోని అధికారులు.. ప్రమాదాల ముప్పులో వాహనదారులు కూసుమంచి, అక్టోబర్ 21( మన ప్రజావాణి): ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గైగోళ్లపల్లి నుంచి నరసింహులగూడెం వెళ్లే ప్రధాన రహదారిపై ఉడతలగూడెం శివారులో నిరంతరం నీరు ప్రవహిస్తుండటంతో ఆర్‌అండ్‌బీ రహదారి దెబ్బతింటోంది. వ్యవసాయ పొలాలకు నీటిని తరలించే పైపుల నుంచి నీరు రోడ్డుపైకి రావడంతో రహదారి తడిసి గుంతలు ఏర్పడుతున్నాయి. దీంతో రోడ్డు క్రమంగా ధ్వంసమవుతోంది. ఈ మార్గంలో నిత్యం ప్రయాణించే రైతులు, ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనదారులు...