అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు పట్టు చీరల సమర్పణ
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
చండూరు పట్టణంలోని శ్రీ బ్రహ్మంగారి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చండూరు మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు, ఆయన ధర్మపత్ని శ్రీమతి అరుణ దంపతులు అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు పట్టు చీరలను సమర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీ బ్రహ్మంగారి దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి సేవలో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో చండూరు పట్టణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
అనంతరం ఆలయ కమిటీ సభ్యులు డా. కోడి శ్రీనివాసులు, శ్రీమతి అరుణ దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అమ్మవారి కృపాకటాక్షాలు ఆ దంపతుల కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.

