📄 ePaper
Epaper 2
Thursday, October 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్అప్పుల భారంతో రైతు ఆత్మహత్య - గట్టుప్పల్ లో విషాదం

అప్పుల భారంతో రైతు ఆత్మహత్య – గట్టుప్పల్ లో విషాదం

📰 Generate e-Paper Clip

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండల కేంద్రానికి చెందిన రైతు అప్పుల బాధ తాళలేక బలవన్మరణానికి పాల్పడిన ఘటన గ్రామంలో విషాదం నింపింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు కొండగాని బిచ్చమయ్య (48), తండ్రి మీనయ్య, గట్టుప్పల్. ఆయన 6 ఎకరాలలో వ్యవసాయం చేస్తున్నాడు. సరైన వర్షాలు లేక పంటలు దెబ్బతినడంతో సాగు కోసం చేసిన సుమారు రూ. 5 లక్షల అప్పు తీర్చలేక కొద్ది రోజులుగా తీవ్ర మనోవేదన లో ఉన్నాడు. ఈ క్రమంలో బుధవారం (30-09-2026) ఆయన పురుగు మందు సేవించగా, గమనించిన అన్న కొండగాని నర్సింహ కుటుంబ సభ్యులు వెంటనే 108 లో గ్రామ ఆర్.ఎం.పి వద్దకు, అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. మృతుని కుమారుడు కొండగాని జగత్ (27, ప్రైవేట్ ఉద్యోగి) ఇచ్చిన ఫిర్యాదు మేరకు గట్టుప్పల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి మృతిపై ఎవరిపైనా అనుమానం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.