అనంతగిరి అయ్యప్ప సన్నిధిలో అన్నప్రసాద వితరణ
ప్రజవాని అనంతగిరి
18వ రోజు 530 మంది స్వాములకు అన్నప్రసాదం
అనంతగిరి: తెలంగాణ శబరిమలగా ప్రసిద్ధి చెందిన అనంతగిరి శ్రీ అయ్యప్ప సన్నిధిలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా 18వ రోజు సుమారు 530 మంది అయ్యప్ప స్వాములు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ రోజు అన్నప్రసాద వితరణకు మహారాజ పోషకులతో పాటు ఖానాపురం గ్రామానికి చెందిన శ్రీ అలవాల సైదులు దంపతులు దాతలుగా వ్యవహరించారు. అయ్యప్ప స్వాములకు అన్నప్రసాదం అందించేందుకు దాతలు ముందుకు రావడం పట్ల ఆలయ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ కొండపల్లి వాసు, పందిరి వీరయ్య, అల్లెబోయిన కోటయ్య, పి. నరసింహారావు, గరిడేపల్లి ఉపేందర్‌తో పాటు మాలధారణ స్వాములు, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.
అయ్యప్ప స్వాముల సేవలో భాగంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
