అనంతగిరి అయ్యప్ప సన్నిధిలో అన్నప్రసాద వితరణ

అనంతగిరి అయ్యప్ప సన్నిధిలో అన్నప్రసాద వితరణ ప్రజవాని అనంతగిరి 18వ రోజు 530 మంది స్వాములకు అన్నప్రసాదం అనంతగిరి: తెలంగాణ శబరిమలగా ప్రసిద్ధి చెందిన అనంతగిరి శ్రీ అయ్యప్ప సన్నిధిలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా 18వ రోజు సుమారు 530 మంది అయ్యప్ప స్వాములు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ రోజు అన్నప్రసాద వితరణకు మహారాజ పోషకులతో పాటు ఖానాపురం గ్రామానికి చెందిన శ్రీ అలవాల సైదులు దంపతులు దాతలుగా వ్యవహరించారు. అయ్యప్ప స్వాములకు అన్నప్రసాదం అందించేందుకు...