📄 ePaper
Epaper 2
Saturday, October 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅక్రమ రేషన్ నిల్వ బియ్యం పట్టుకున్న మద్దూరు పోలీసులు

అక్రమ రేషన్ నిల్వ బియ్యం పట్టుకున్న మద్దూరు పోలీసులు

📰 Generate e-Paper Clip

అక్రమ రేషన్ నిల్వ బియ్యం పట్టుకున్న మద్దూరు పోలీసులు

బెక్కల్ లో ట్రాక్టర్ బ్యాటరీ చోరీ

మద్దూరు అక్టోబర్14, ప్రజా వాణి,

దూలిమిట్ట మండల కేంద్రంలో అక్రమంగా రేషన్ బియ్యం బుట్టాయగూడెం చెందిన వ్యక్తి కొనుగోలు చేసి ఓ ఇంట్లో నిల్వ చేసి ఉంచిన సమాచారం మేరకు మద్దూరు ఎస్సై మహమ్మద్ ఆసీఫ్ ఆధ్వర్యంలో పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలిసింది. మండలంలో విపరీతంగా అక్రమ రేషన్ బియ్యం రవాణా దందా జోరుగా సాగుతున్నట్లు సమాచారం పోలీసులు నిఘా పెంచి బియ్యం రవాణాకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.

*పోలీసుల వైఫల్యంతోనే ట్రాక్టర్,బ్యాటరీ చోరీలు*

మద్దూరు అక్టోబర్ 14, ప్రజా వాణి,

మండలంలోని ఏదో గ్రామంలో రెండు మూడు రోజుల ఒకసారి దొంగలు హాల్ చల్ చేస్తూ వ్యవసాయ బావుల వద్ద ఉన్న ట్రాక్టర్ల బ్యాటరీలు ఎత్తుకెళ్లి పోలీసులకు సవాలుగా మారుతున్న పోలీసులు రాత్రి పూట గ్రామాల్లో నిఘా పెంచడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాల గ్రామాల్లో గతంలో ట్రాన్స్ ఫార్మర్ వైర్, ట్రాక్టర్ బ్యాటరీలు చోరీ జరుగగా తాజాగా బెక్కల్ గ్రామంలో ట్రాక్టర్ బ్యాటరీ చోరీ జరగడంతో పోలీసుల వైఫల్యంతోనే దొంగలు చోరీలకు పాల్పడుతున్నారని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. దసరా బతుకమ్మ వేడుకల్లో ప్రజలు ఉండగా దొంగలు ఇదే అదనుగా భావించి చోరీలకు పాల్పడే అవకాశం ఉందని పోలీసులు గ్రామాల్లో గస్తీ పెంచాలని మండల ప్రజలు కోరుతున్నారు.
…గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తూ తక్షణమే పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలని ఎస్సై మహమ్మద్ ఆసీఫ్ మండల ప్రజలను కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.