సొంతింటి కలకు కాంగ్రెస్ భరోసా
లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ ఫారాలు అందజేత
డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి, సెప్టెంబర్ 8, ప్రజావాణి :
పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా కురవి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో నలుగురు లబ్ధిదారులకు
మండల సీతమ్మ, మండల ఉపేంద్ర, మండల సరిత, నెరుసుల నాగలక్ష్మిలకు ప్రొసీడింగ్ ఫారాలు అందించారు.
కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు రాజేందర్ నారాయణ కుమార్, మంగళవారం అందజేశారు.
ఈసందర్బంగా ఆయన మాట్లాడుతు …
డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో అర్హులైన పేద కుటుంబాలకు సొంత ఇల్లు కల్పించాలనే సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకుని పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కురవి ఉప సర్పంచ్ ఎర్ర నాగేశ్వరరావు, మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శి రాజేష్ వేద, ఇందిరమ్మ కమిటీ సభ్యురాలు తరాల కళావతి, మాజీ వార్డు సభ్యుడు బానోత్ లక్ష్మణ్ నాయక్, బి. యల్. ఎ, సంగెం నాగరాజు, తరాల వీరన్న, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బత్తిని సత్తయ్య, బుక్క నాగరాజు పాల్గొన్నారు.

