స్పీకర్‌పై వ్యాఖ్యల దుమారం!
తాత మధు బర్తరఫ్‌కు కాంగ్రెస్ డిమాండ్
చెన్నారావుపేటలో ధర్నా.. కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
చెన్నారావుపేట సెప్టెంబర్ 07 ప్రజావాణి
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాత మధు చేసినట్లు పేర్కొంటున్న అనుచిత వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు చెన్నారావుపేట మండల కేంద్రంలో ఆందోళనకు దిగాయి. తాత మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించి.. అనంతరం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిద్ధన రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో రోడ్డుపై బేటాయించి ధర్నాకు దిగారు.సిద్ధన రమేష్ మాట్లాడుతూ.. దళిత సామాజిక వర్గానికి చెందిన అసెంబ్లీ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. తాత మధు వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత సమాజాన్ని అవమానించే వ్యాఖ్యలను సహించేది లేదని స్పష్టం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం దళిత నేత గడ్డం ప్రసాద్‌కుమార్‌ను రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టి గౌరవించిందని సిద్ధన రమేష్ అన్నారు. గతంలో కేసీఆర్ దళిత ప్రజాప్రతినిధుల పట్ల వ్యవహరించిన తీరును ప్రజలు ఇంకా మర్చిపోలేదని విమర్శించారు.అసెంబ్లీ ఎదుట నిరసన చేపట్టిన సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలీసుల పట్ల వ్యవహరించిన తీరు కూడా బాధ్యతారాహిత్యంగా ఉందని ఆరోపించారు. స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలను తాత మధు ఉపసంహరించుకోకపోతే కాంగ్రెస్ శ్రేణులు, దళిత సమాజం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందని హెచ్చరించారు. ట్రాఫిక్ స్తంభించడంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి నాయకులతో మాట్లాడి ధర్నాను విరమింపచేసి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు.ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ భూక్య గోపాల్‌నాయక్, మాజీ ఎంపీపీ వీరారెడ్డి కేతిడి, జిల్లా కార్యదర్శి కంది కృష్ణచైతన్యరెడ్డి, సొసైటీ డైరెక్టర్లు మంద యాకయ్యగౌడ్, చిప్ప లక్ష్మణ్, వీరాస్వామి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మైబు సింగ్ రాథోడ్, పలువురు సర్పంచులు, మార్కెట్ డైరెక్టర్లు, యువజన కాంగ్రెస్, ఎస్సీ సెల్ నాయకులు, మాజీ సర్పంచులు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు, వార్డు సభ్యులు, ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

