సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత.
కోటగిరి/ప్రజావాణి:- నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం పోతంగల్ మండలంలోని జల్లాపల్లి అబాది గ్రామానికి చెందిన మాలోత్ రేణుక భర్త మాలోత్ శ్రీనివాస్‌కు మంజూరైన రూ.52,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్‌ను గ్రామ సర్పంచ్ బర్మవత్ వివేక్ సోమవారం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సహకారంతో ఈ ఆర్థిక సహాయం అందజేసినట్లు సర్పంచ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఖాజా గౌసిద్దీన్, గ్రామ పంచాయతీ సభ్యులు శేషారావు,మాలోత్ శ్రీనివాస్, దేవి సింగ్,మైనార్టీ కోఆప్షన్ సభ్యుడు మొహమ్మద్ ఖాన్, కోటగిరి మార్కెట్ కమిటీ డైరెక్టర్ యశ్వంత్,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధన్‌రాజ్ రాథోడ్,నాయకులు షఫీ,మోహన్, తదితరులు పాల్గొన్నారు.

