📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసింగరేణి క్వార్టర్ స్వాధీనం

సింగరేణి క్వార్టర్ స్వాధీనం

📰 Generate e-Paper Clip

*సింగరేణి క్వార్టర్ స్వాధీనం*

 

* *మన ప్రజావాణి* మందమర్రి:- ఆగస్టు08

పట్టణ బిఆర్ఎస్ నాయకుడు మద్ది శంకర్ నివాసం ఉంటున్న సింగరేణి క్వార్టర్‌ ను మంగళవారం సింగరేణి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సింగరేణి ఎస్టేట్ జూనియర్ అధికారి ఆసిఫ్, క్వార్టర్ సెక్షన్ ఇంచార్జ్, సీనియర్ పిఓ ఎం కార్తీక్, ఏరియా యాక్టింగ్ సెక్యూరిటీ అధికారి ప్రదీప్ కుమార్ ల ఆధ్వర్యంలో సింగరేణి ఎస్ అండ్ పీసీ, సివిల్ సిబ్బంది క్వార్టర్ తాళాలు పగులగొట్టి, క్వార్టర్ ను సింగరేణి ఆధీనంలోకి తీసుకున్నారు. క్వార్టర్‌ లోని సామగ్రిని డ్యూటీ డీసీఎం వాహనంలో ఏరియా ఎస్ అండ్ పిసి కార్యాలయానికి తరలించారు. ఘటన సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పట్టణ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే క్వార్టర్ ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా క్వార్టర్ స్వాధీనం జరుగుతున్న సమయంలో పట్టణ బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎవరూ అక్కడికి రాకపోవడం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.