📄 ePaper
Epaper 2
Wednesday, September 23, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్వైయస్ జగన్ ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదు

వైయస్ జగన్ ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదు

📰 Generate e-Paper Clip

వైయస్ జగన్ ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదు

గత ప్రభుత్వంలో టిడిపి కార్యకర్తలపై ఎన్నో కేసులు నమోదు చేశారు

టిడిపికి కార్యకర్తలే బలం

రాప్తాడు బహిరంగ సభలో
మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు

అనంత పురం బ్యూరో సెప్టెంబర్ 22 ప్రజా వాణి
స్వర్గీయ నందమూరి తారకరామరావు, పరిటాల రవీంద్ర విగ్రహాల ఆవిష్కరణకు విచ్చేసిన మంత్రి నారా లోకేష్ . కార్యక్రమం అనంతరం రాప్తాడు నియోజకవర్గ కార్యకర్తల సమన్వయ సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా నిరుద్యోగులను మోసం చేసిన జగన్.. ఇప్పుడు ఉపాధ్యాయులపై దాడులు చేయించడం దారుణమన్నారు. నిన్న శాప్ కార్యాలయం వద్ద గురువులపై గొడ్డలిపార్టీ రౌడీమూకలు విచక్షణారహితంగా గుడ్లతో దాడిచేశారని, ఈ దాడిలో పాల్గొన్న రౌడీ బ్యాచ్ లో ఏ ఒక్కరినీ వదలిపెట్టమని లోకేష్ హెచ్చరించారు. రాప్తాడులో గత ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యకర్తలను వేధించి, తప్పుడు కేసులు పెట్టిన తోపుదుర్తి ప్రకాశ్‌ అవినీతి, దాడుల రాజకీయాలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు. కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులను తొలగించే బాధ్యత త‌న‌ద‌ని హామీ ఇచ్చారు.టీడీపీకి కార్యకర్తలే బలమని, కష్టకాలంలో పార్టీ జెండాను వీడకుండా పోరాడిన కార్యకర్తల త్యాగాలను ఎప్పటికీ మర్చిపోమని నారా లోకేష్ అన్నారు. కార్యక్రమం అనంతరం కార్యకర్తల కష్టసుఖాలను అడిగి తెలుసుకుని, వారి సమస్యలను స్వయంగా విన్నారు. కార్యకర్తల ఆరోగ్యం, సంక్షేమం కోసం పార్టీ అండగా ఉంటుందని, కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరినీ గుర్తించి తగిన అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.