📄 ePaper
Epaper 2
Friday, September 25, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవైభవంగా సింగరేణి వరసిద్ధి వినాయకుని శోభాయాత్ర

వైభవంగా సింగరేణి వరసిద్ధి వినాయకుని శోభాయాత్ర

📰 Generate e-Paper Clip

*వైభవంగా సింగరేణి వరసిద్ధి వినాయకుని శోభాయాత్ర*

*ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి డాక్టర్ గడ్డం వివేక్*

*వేలంలో లక్ష దాటిన లడ్డు*

* *మన ప్రజావాణి* మందమర్రి:-

పట్టణంలోని మార్కెట్ సెంటర్ లో శ్రీశ్రీశ్రీ సింగరేణి వరసిద్ధి వినాయక మండలి ఆధ్వర్యంలో చెన్నూరు ఎమ్మెల్యే, రాష్ట్రమంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన భారీ గణనాథుని శోభయాత్ర గురువారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి, సింగరేణి ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ, మండల తహశీల్దార్ పి సతీష్ కుమార్, పట్టణ మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు లు హాజరయ్యారు. ఈసందర్భంగా నిర్వహించిన వేలం పాటలో భారీ గణనాథుని లడ్డూను 1,16,000 లకు రావికంటి శాలిని కైవసం చేసుకున్నారు. అదేవిధంగా గణపతి మాలను 16,000 రూపాయలకు పవన్ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, ఆ గణనాథుని దయవల్ల ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. మందమర్రి ఏరియాకు త్వరలో నూతనంగా కొత్త గని రాబోతుందని తెలిపారు. ఈ ప్రాంతం 1/70 ఏజెన్సీ యాక్ట్ లో ఉన్నందువలన ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవడానికి గతంలో ఇబ్బందులు ఉండేవని,అతి త్వరలో అలాంటి ఇబ్బందులు తొలగిపోనున్నాయని స్పష్టం చేశారు. అదేవిధంగా త్వరలోనే పట్టణంలో 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సైతం ప్రభుత్వం నుండి అనుమతి రానున్నదని తెలిపారు. అనంతరం పట్టణంలోని వినాయక మండపాల నిర్వాహకులను శాలువాతో ఘనంగా సన్మానించారు. తదనంతరం భారీ గణనాధుని భాజా భజంత్రీలు, డిజే చప్పుళ్ళు మధ్య ఉత్సాహభరిత నృత్యాలతో సమీప నది తీరానికి నిమజ్జనానికి తరలించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.