📄 ePaper
Epaper 2
Wednesday, September 23, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవివేకానంద పార్క్‌ అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి: సింధు ఆదర్శ్ రెడ్డి

వివేకానంద పార్క్‌ అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి: సింధు ఆదర్శ్ రెడ్డి

📰 Generate e-Paper Clip

*వివేకానంద పార్క్‌ అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి: సింధు ఆదర్శ్ రెడ్డి

రామచంద్రపురం, సెప్టెంబర్‌ 22 (ప్రజావాణి):శేరిలింగంపల్లి నియోజకవర్గం భారతీనగర్‌ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ సింధు ఆదర్శ్‌రెడ్డి మంగళవారం ఓల్డ్‌ ఎంఐజీ కాలనీలోని వివేకానంద పార్క్‌ను సందర్శించారు. ఉద్యానవన అభివృద్ధి విభాగం నిర్వాహకుడు సతీష్‌తో కలిసి పార్క్‌ను పరిశీలించిన ఆమె.. తన కార్పొరేటర్‌గా ఉన్న సమయంలో ప్రతిపాదించిన అభివృద్ధి పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పార్క్‌లో చిన్నారుల ఆట పరికరాలు, బహిరంగ వ్యాయామశాల, బహుళ ప్రయోజన క్రీడా ప్రాంగణం తదితర అభివృద్ధి పనుల పరిస్థితిని ఆమె పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి స్థానిక ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సింధు ఆదర్శ్‌రెడ్డి కోరారు. ముఖ్యంగా చిన్నారులు, యువతకు ఉపయోగపడే సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఉద్యానవన అభివృద్ధి విభాగం పర్యవేక్షకుడు రాములు, సొసైటీ అధ్యక్షుడు బాలయ్య, ఉపాధ్యక్షుడు నారాయణగౌడ్‌, రాములు, మాజీ కౌన్సిలర్‌ నాగమణి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు భాస్కర్‌ ముదిరాజ్‌, చిన్నా, శ్రీనివాస్‌, రాకేష్‌రెడ్డి, లక్ష్మి, స్వర్ణలత, ప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.