వివేకానంద పార్క్‌ అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి: సింధు ఆదర్శ్ రెడ్డి

*వివేకానంద పార్క్‌ అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి: సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రపురం, సెప్టెంబర్‌ 22 (ప్రజావాణి):శేరిలింగంపల్లి నియోజకవర్గం భారతీనగర్‌ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ సింధు ఆదర్శ్‌రెడ్డి మంగళవారం ఓల్డ్‌ ఎంఐజీ కాలనీలోని వివేకానంద పార్క్‌ను సందర్శించారు. ఉద్యానవన అభివృద్ధి విభాగం నిర్వాహకుడు సతీష్‌తో కలిసి పార్క్‌ను పరిశీలించిన ఆమె.. తన కార్పొరేటర్‌గా ఉన్న సమయంలో ప్రతిపాదించిన అభివృద్ధి పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్క్‌లో చిన్నారుల ఆట పరికరాలు, బహిరంగ వ్యాయామశాల, బహుళ ప్రయోజన క్రీడా ప్రాంగణం తదితర అభివృద్ధి...