📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapetలాలి తండా సేవాలాల్ యూత్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా మహా అన్నదాన కార్యక్రమం. 

లాలి తండా సేవాలాల్ యూత్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా మహా అన్నదాన కార్యక్రమం. 

📰 Generate e-Paper Clip

లాలి తండా సేవాలాల్ యూత్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా మహా అన్నదాన కార్యక్రమం.

 

హుజూర్నగర్ సెప్టెంబర్ 19 (ప్రజావాణి)

సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండలం లోని లాలి తండా గ్రామంలో సేవాలాల్ యూత్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగినది. గణేష్ ని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అన్న ప్రసాదాన్ని స్వీకరించడానికి లాలితండా గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పెద్దలు, మహిళలు, యువత, చిన్నారులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు అన్నప్రసాదాల వితరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రుల సందర్భంగా అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు చెప్పారు. ఈ అన్నదాన కార్యక్రమానికి విరాళాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగినది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.