భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కోర్టులో ఈ నెల 12న జిల్లా
న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే లోక్ అదాలత్ ను మండలంలోని ప్రజలు కేసుల పరిష్కారానికి సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై సుధాకర్ దాసరిఒక ప్రకటనల పేర్కొన్నారు.
ఆయన మాట్లాడుతూ…జాతీయ లోక్ అదాలత్ లో రాజిపడదగిన కుటుంబ తగదాలు, బ్యాంకు లావాదేవీలు, చెక్ బౌన్స్, తదితర కేసులు పరిష్కరమవుతాయని పేర్కొన్నారు..డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వారు, చిన్న చిన్న యాక్సిడెంట్ కేసెస్, తిట్టుకున్న కేసులు, కొట్టుకున్న కేసులు,
భార్యాభర్తల కేసులు, రాజీమార్గం ద్వారా ఇలా తదితర కేసులకు కోర్టులో పరిష్కారం చేసుకోవచ్చును అన్నారు.
దీనిని సద్వినియోగం చేసుకోవాలని, రాజీమార్గమే రాజా మార్గం అన్నారు

