📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMuluguరాజకీయంగా ఎదుర్కోలేకే భౌతిక దాడులు..

రాజకీయంగా ఎదుర్కోలేకే భౌతిక దాడులు..

📰 Generate e-Paper Clip

.కాంగ్రెస్ పై బీజేపీ మండల అధ్యక్షుడు మార్క సతీష్ ఫైర్.
.ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్.. గోవిందరావుపేటలో బీజేపీ ధర్నా.
.బీజేపీ కార్యాలయంపై దాడి గోవిందరావుపేటలో హై టెన్షన్.. భారీగా మోహరించిన పోలీసులు.
.కాంగ్రెస్ పిరికిపంద చర్యలకు నిదర్శనమే ఈ దాడి.
.గోవిందరావుపేటలో కాషాయ శ్రేణుల నిరసన గళం.
.దాడిని తీవ్రంగా ఖండించిన బీజేపీ.

గోవిందరావుపేట (ప్రజావాణి)

  • భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ గోవిందరావుపేట మండల కేంద్రంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమం నిర్వహించారు.
    ఈ సందర్భంగా బీజేపీ గోవిందరావుపేట మండల అధ్యక్షుడు *మార్క సతీష్* మాట్లాడుతూ, రాజకీయంగా బీజేపీని ఎదుర్కోలేక ఇలాంటి దాడులకు పాల్పడటం కాంగ్రెస్ పార్టీ పిరికిపంద చర్యలకు నిదర్శనమని అన్నారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను రాజకీయంగా ఎదుర్కోవాల్సింది పోయి హింసాత్మక చర్యలకు పాల్పడటం దురదృష్టకరమని పేర్కొన్నారు.
    రాష్ట్ర కార్యాలయంపై దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
    ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మద్దినేని తేజరాజు, కొత్త సుధాకర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు బొల్లంపల్లి మురళి, పసుల గారు, కోటగడ్డ గ్రామ ఉప సర్పంచ్, మండల సోషల్ మీడియా ఇన్చార్జ్ పర్రేం రఘు, నిడుమోలు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు బండి వేణు, సీనియర్ నాయకులు తక్కలపల్లి దేవేందర్ రావు, కర్ర సాంబశివరెడ్డి, పాండు, మంజా నాయక్, రుద్రారపు సురేష్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మెరుగు సత్యనారాయణ, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు బిళ్ళం కృష్ణమోహన్, బూత్ అధ్యక్షులు వలపుదాసు రవిశంకర్, యార్లగడ్డ నాగేశ్వరరావు, పూజారి శ్రీను, కమటం కిరణ్, పోతరాజు సురేష్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.