📄 ePaper
Epaper 2
Wednesday, September 23, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్రజక సంఘం సిద్దిపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా దీటి రాజు

రజక సంఘం సిద్దిపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా దీటి రాజు

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి, సెప్టెంబర్ 23 (ప్రజావాణి)

తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి–రజక సంఘం సిద్దిపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన దీటి రాజు రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ గణేష్, జిల్లా అధ్యక్షులు జంగపల్లి ఐలయ్యలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.అలాగే సిద్దిపేట జిల్లాలోని అన్ని మండలాల రజక కులబాంధవులకు, ముఖ్యంగా బెజ్జంకి మండలం, తన గ్రామంలోని రజక అన్నదమ్ములకు కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తూ రజక జాతి ఐక్యత, అభివృద్ధి, హక్కులు, సంక్షేమం కోసం కృషి చేస్తానని దీటి రాజు పేర్కొన్నారు.ప్రతి రజక కుటుంబానికి అండగా నిలుస్తూ సమాజ అభ్యున్నతికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. రజక జాతి ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.