📄 ePaper
Epaper 2
Wednesday, September 23, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

📰 Generate e-Paper Clip

గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
ప్రజావాణి కూసుమంచి – సెప్టెంబర్ 23
కూసుమంచి మండలంలోని జీళ్లచెరువు గ్రామ ఊర చెరువులో నిర్వహించనున్న శ్రీ గణేష్ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇన్‌చార్జి భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి బుధవారం పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. నిమజ్జన మార్గాలు, భద్రతా ఏర్పాట్లు, తాగునీటి వసతి, విద్యుత్‌ లైటింగ్‌, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలను ఆయన పరిశీలించారు. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున పోలీసు, రెవెన్యూ, పంచాయతీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో కూసుమంచి తహసీల్దార్ సైదులు, ఎంపీడీవో జితేందర్, ఎస్‌ఐ నాగరాజు, నేలకొండపల్లి ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బజ్జూరి వెంకటరెడ్డి, జీళ్లచెరువు సర్పంచ్ ఐతగాని వెంకటరమణ, నాగేశ్వరరావు, కొండా మహిపాల్, బానోత్ శ్రీను నాయక్, పీబీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.