యాసంగిలో పప్పు ధాన్య పంటలు సాగు చేయాలి
ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి
డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి,సెప్టెంబర్ 22 ప్రజావాణి:
తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున యాసంగిలో రైతులు పప్పు ధాన్య పంటలు సాగు చేయాలని ఆత్మ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి కోరారు
కురవి రైతు వేదికలో మిషన్ ఆత్మ నిర్భరత పల్సేస్ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి, ఏడి మురళి 50%తో ప్రభుత్వం అందించే మినుములను రైతులకు అందించి,రైతులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం వలన తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన దృష్ట్యా జలాశయాల్లో నీరు రాక, బోర్లు,బావులు ఎండి, భూగర్భ జలాలు అడుగంటిన నేపథ్యంలో ఒక ఎకరా వరి పంటకు సరిపోయే నీరుతో, రెండు నుండి మూడు ఎకరాల పప్పు ధాన్యాల పంటను సాగు చేయవచ్చునని, కాబట్టి వరి ఏ రైతు కూడా వేయకుండా, నూనె పప్పు ధాన్యాల పంటతో ఉద్యానవన పంటలను సాగు చేయాలని, ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో మినుములు అoదిస్తున్నది కాబట్టి రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు
*ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ లో పేరు నమోదు చేసుకోవాలని లేనిచో, పండించిన పంట అమ్ముకోవడం కుదరదని, యూరియా సరఫరా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీలు అందవు కాబట్టి ప్రతి రైతు సంబంధిత ఏఈఓ లను సంప్రదించాలని కోరారు
దేశంలోనే అత్యధికంగా యూరియా వాడకం తెలంగాణ ప్రాంతంలో జరుగుతుందని, రైతాంగం యూరియా వాడకాన్ని తగ్గించి భూసారాన్ని కాపాడుకోవాలని కోరారు
కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి గుంటక నరసింహారావు, రాజేశ్వరి,రవళి, రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు
