మోదీ జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక అభిషేకం

*మోదీ జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక అభిషేకం* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (ప్రజా వాణి )మంచాల, సెప్టెంబర్ 17 : దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంచాల గ్రామంలోని శ్రీ హరిహర మహా క్షేత్రంలో బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పేరు మీద ప్రత్యేక అభిషేకం చేపట్టారు. దేశం సుభిక్షంగా, శాంతిసౌభాగ్యాలతో వర్ధిల్లాలని, ప్రధాని నరేంద్ర మోదీ ఆయురారోగ్యాలతో ఉండాలని నాయకులు ఆకాంక్షించారు. దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రధాని మరింత కాలం సేవలందించాలని...