📄 ePaper
Epaper 2
Saturday, September 26, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMuluguములుగులో స్పెషల్ లోక్ అదాలత్

ములుగులో స్పెషల్ లోక్ అదాలత్

📰 Generate e-Paper Clip

13 కేసుల పరిష్కారం.. రూ.10.62 లక్షలు రికవరీ!
రాజీమార్గమే రాజమార్గం..

ములుగు జిల్లా కోర్టులో స్పెషల్ లోక్ అదాలత్ ప్రారంభం

ములుగు జిల్లా కోర్టులో లోక్ అదాలత్.. ఒక్కరోజే 13 కేసులు పరిష్కారం

కక్షిదారులకు న్యాయ సేవాధికార సంస్థ సూచనలు

ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)

జాతీయ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు ఉదయం 10 గంటలకు ములుగు జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గారి ఆధ్వర్యంలో స్పెషల్ లోక్ అదాలత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ FAC Secretary శ్రీ. టి. కన్నయ్య లాల్ గారు మాట్లాడుతూ రాజీమార్గమే రాజ మార్గమని, ఈ స్పెషల్ లోక్ అదాలత్ లో కక్షిదారులు తమ కేసులను రాజీ కుదుర్చుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని తెలియజేశారు. లోక్ అదాలత్ లో తమ కేసులను రాజీ చేసుకుంటే అప్పీలు ఉండదని అదే అంతిమ తీర్పు అవుతుందని తెలిపారు. ఈ లోక్ అదాలత్ లో ఒక బెంచీను ఏర్పాటు చేసి పెండింగ్ (13) బ్యాంక్ PLC కేసులను, 10,62,000 అమౌంట్ ను పరిష్కరించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ టి.కన్నయ్య లాల్ గారు, Bank Officials, న్యాయవాదులు, పోలీస్ అధికారులు, కోర్ట్ కానిస్టేబుళ్ళు మరియు కోర్టు సిబ్బంది, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.