📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMuluguములుగులో సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్

ములుగులో సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్

📰 Generate e-Paper Clip

 

కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి S.V.P సూర్యచంద్ర కళ

ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)

జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు ములుగు జిల్లాలోని అన్ని కోర్టులలో ఈ నెల 12వ తేదీ (శనివారం) నాడు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి S.V.P సూర్యచంద్ర కళ గారు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ లోక్ అదాలత్ లో రాజీపడదగిన అన్ని రకాల కేసులను పరిష్కరించనున్నట్లు ఆమె తెలిపారు.

పరిష్కరించే కేసులు

క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, ప్రీ-లిటిగేషన్ కేసులు, బ్యాంకు కేసులు, విద్యుత్ కేసులు, భూ తగాదా కేసులు, వివాహ/కుటుంబ తగాదా కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, చిట్ ఫండ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, చెక్ బౌన్స్ కేసులు మరియు ఇతర రాజీపడదగు కేసులన్నీ పరిష్కరించబడునని తెలిపారు.కావున జిల్లాలోని కక్షిదారులందరూ ఈ నెల 12వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ లో హాజరై తమ కేసులను పరిష్కరించుకొని ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ములుగు జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక! మీ కేసులు ఏళ్ల తరబడి కోర్టులో పెండింగ్ లో ఉన్నాయా? అయితే మీకోసమే గుడ్ న్యూస్! ఈ నెల 12వ తేదీ శనివారం రోజున ములుగు జిల్లాలోని అన్ని కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. బ్యాంకు, భూ తగాదా, ఫ్యామిలీ, యాక్సిడెంట్, చెక్ బౌన్స్ కేసులు ఇలా రాజీకి వచ్చే అన్ని కేసులు ఇక్కడే పరిష్కారం అవుతాయి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూర్యచంద్ర కళ గారు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.