📄 ePaper
Epaper 2
Tuesday, September 22, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJangaonమహిళా సేవాదళ్ కమిటీల బలోపేతానికి కృషి

మహిళా సేవాదళ్ కమిటీల బలోపేతానికి కృషి

📰 Generate e-Paper Clip

*మహిళా సేవాదళ్ కమిటీల బలోపేతానికి కృషి*-

*మహిళా సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పడాల సంగీత*

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 21 (ప్రజావాణి):
జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం మహిళా సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షురాలు పడాల సంగీత, జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీ నారాయణ లకావత్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా జనగామ జిల్లాలో మహిళా సేవాదళ్ కమిటీల ఏర్పాటు, విధివిధానాలు, సంస్థాగత కార్యక్రమాలపై ఇరువురు చర్చించారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మహిళా సేవాదళ్‌ను బలోపేతం చేయడంతో పాటు, పార్టీ కార్యక్రమాల్లో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచే అంశాలపై చర్చించారు.

జనగామ జిల్లాలో మహిళా కాంగ్రెస్ సేవాదళ్ కమిటీలను జిల్లా స్థాయి, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయిలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆయా స్థాయిల్లో బాధ్యతలు చేపట్టి పార్టీ కోసం పనిచేయడానికి ఆసక్తి, నిబద్ధత, విధేయత కలిగిన మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ముందుకు రావాలని వారు కోరారు.

మహిళా సేవాదళ్ కమిటీల ద్వారా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంతో పాటు, మహిళలను పార్టీ సంస్థాగత కార్యక్రమాల్లో చురుకుగా భాగస్వాములను చేసేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు జాయ మల్లేష్, మహిళా సేవాదళ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మేరీ, జనరల్ సెక్రటరీ విజయ, అరుణ, కోశాధికారి పద్మ, జనరల్ సెక్రటరీ రవి, ప్రభాకర్ రెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ బిర్రు సత్యనారాయణ, గుగులోతు కిషన్, పట్టణ 14వ వార్డు కౌన్సిలర్ అండాలు, బుట్రెడ్డి శ్రీలత రెడ్డి, మున్నీ బేగం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.