📄 ePaper
Epaper 2
Thursday, September 24, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్భగత్‌సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాథుడికి 88 రకాల నైవేద్యాలు

భగత్‌సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాథుడికి 88 రకాల నైవేద్యాలు

📰 Generate e-Paper Clip

భగత్‌సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాథుడికి 88 రకాల నైవేద్యాలు

చెప్పన్ 56 భోగ్‌లో భాగంగా ప్రత్యేక అలంకరణలు.. భక్తులను ఆకట్టుకున్న ప్రసాదాలు

మేడ్చల్, సెప్టెంబర్ 23 (ప్రజావాణి): మేడ్చల్ డివిజన్ పరిధిలోని భగత్‌సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపంలో చెప్పన్ 56 భోగ్ కార్యక్రమంలో భాగంగా గణనాథుడికి 88 రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు. పండ్లు, స్వీట్లు, పిండివంటలు, వివిధ రకాల ఆహార పదార్థాలతో ప్రత్యేకంగా సిద్ధం చేసిన నైవేద్యాలను వినాయకుడి ముందుంచి వేద మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకుడిని విశేషంగా అలంకరించడంతో పాటు మండపాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు.
ఈ అరుదైన కార్యక్రమాన్ని తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భగత్‌సింగ్ యూత్ అసోసియేషన్ సభ్యులు, యువకులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం భక్తి, ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.